యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. కావ్య థాపర్ కథానాయిక. నిఖిల కోనేరు నిర్మాత. ఈ నెలలోనే సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి దర్శకుడు వీవీ వినాయక్ అతిథిగా విచ్చేసి పాటను ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
‘మెరుపులే..’ అంటూ సాగిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, మిక్కీ జే.మేయర్ స్వరపరిచారు. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కామెడీ, రొమాన్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాల మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో హవీష్, కథానాయిక కావ్య థాపర్, చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన, కోనేరు సత్యనారాయణ, కోనేరు శివకాంచన లత, నిర్మాత నిఖిల కోనేరు, ఇంకా చిత్రబృందం పాల్గొన్నారు.