చండీగఢ్: లైంగికదాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీంకు 50 రోజుల పెరో ల్ మంజూరైంది. రెండు నెలల క్రితం ఆయన 21 రోజుల పాటు జైలు నుంచి విడుదలయ్యారు. హర్యానాలోని రోహ్తక్ జిల్లా, సునరియా జైలులో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన జైలు నుంచి తాత్కాలికంగా విడుదలైన సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమానికి వెళతారు. ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసినట్లు రుజువుకావడంతో ఆయనకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.