పాట్నా, ఆగస్టు 20: మంత్రులంతా హుందాగా నడుచుకోవాలని, అణకువగా ఉండాలని తన సహచర ఆర్జేడీ మంత్రులకు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సూచించారు. ఈ మేరకు శనివారం మంత్రులను ఉద్దేశిస్తూ ప్రవర్తన నియమావళి ట్వీట్ చేశారు. మంత్రులెవరూ కొత్తగా కార్లు కొనొద్దని, తమ వద్దకు వచ్చే వారు కాళ్లు మొక్కకుండా చూసుకోవాలని ఉపదేశించారు. కలిసినప్పుడు నమస్కారం మాత్రమే చేసుకోవాలని చెప్పారు. కులమత బేధం లేకుండా పేదలందరికీ సాయం చేసేందుకు ప్రయత్నించాలన్నారు.