న్యూఢిల్లీ, జూలై 23: ఈసారి కేంద్ర బడ్జెట్లో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖకు రూ.13,539 కోట్లు కేటాయించారు. 2023-24 సవరించిన అంచనాల ప్రకారం ఈ శాఖకు కేటాయించిన రూ.9,853.32 కోట్లతో పోలిస్తే ఈ నిధులు 37 శాతం ఎక్కువ. రూ.9,549.98 కోట్లను షెడ్యూల్ కులాల అభివృద్ధి పథకానికి కేటాయించారు. ఇతర వెనకబడిన వర్గాల అభివృద్ధి కోసం రూ.2,150కోట్లను కేటాయించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కార్యాచరణ ప్రణాళికకు రూ.314 కోట్లు, షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్కు రూ.38, వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్కు రూ.21 కోట్లు కేటాయించారు.