న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు డెంగ్యూ సోకింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఇటీవల మన్మోహన్‌కు జ్వరం వచ్చి తగ్గింది. కానీ నీరసంగా ఉండటంతో ఎయిమ్స్‌లో చేరారు. పరీక్షించిన వైద్యులు డెంగ్యూ సోకినట్టు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. మరోవైపు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ఎయిమ్స్‌లో మన్మోహన్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.