ముంబై: ఒక రోడ్డుపై పెద్ద చెట్టు పడింది. అయితే స్కూటర్‌పై వెళ్తున్న డెలివరీ బాయ్ మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. (Delivery Boy Miraculously Escapes) ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. మార్చి 29న శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో విరార్ ప్రాంతంలోని అగాషి చల్పేత్ సమీపంలో అకస్మాత్తుగా భారీ చెట్టు కూలింది.
కాగా, ఆ సమయంలో ఒక డెలివరీ వ్యక్తి స్కూటర్‌పై ఆ రోడ్డులో వెళ్తున్నాడు. చెట్టు నేరుగా ఆ స్కూటర్‌పై పడింది. అయితే దానిపై ఉన్న డెలివరీ బాయ్ తృటిలో తప్పించుకున్నాడు. అదృష్టవశాత్తు మృత్యువు బారిన పడలేదు. స్వల్ప గాయాలో బటయపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
#मुंबई से सटे विरार में एक दिल दहला देने वाली घटना CCTV में कैद हुई!
👉 शनिवार रात 10:30 बजे, सड़क किनारे अचानक एक भारी भरकम पेड़ सड़क पर स्कूटी से जा रहे डिलीवरी बॉय पर गिर गया, भाग्यवश उसकी जान बच गई.
#Virar #CCTVFootage #NarrowEscape #DeliveryBoy #MumbaiNews #ncrpatrika… pic.twitter.com/JOCr0QQlmL
— NCR पत्रिका (@ncrpatrika) March 30, 2025