Annu Dhankar : హిమాన్షు అలియాస్ భావు గ్యాంగ్ (Bhau Gang) కు చెందిన మహిళా డాన్ అన్ను ధన్‌కఢ్ (Annu Dhankar) కు ఢిల్లీ (Delhi) లోని పటియాలా హౌస్‌కోర్టు (Patiala House Court) ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రాజౌరీ గార్డెన్‌లోని బర్గర్ కింగ్ రెస్టారెంట్ దగ్గర అమన్ జూన్ (Aman Joon) అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో అన్ను ధన్‌కఢ్ నిందితురాలిగా ఉంది. హిమాన్షు సూచన మేరకు అమెరికాకు పారిపోయే ప్రయత్నంలో ఉన్న అన్నూను శుక్రవారం రాత్రి నేపాల్ సరిహద్దుకు సమీపంలో యూపీలోని లఖీంపూర్ ఖేరీలో అదుపులోకి తీసుకున్నారు.
Delhi’s Patiala House Court has sent Annu Dhankar, female associate of Himanshu alias Bhau gang to seven-day judicial custody.
She has been arrested in connection with the murder of Aman Joon at Burger King restaurant in Rajouri Garden. https://t.co/AEm6inY2TT
— ANI (@ANI) October 26, 2024
ఇవాళ మధ్యాహ్నం పోలీసులు ఆమెను పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు. దాంతో కోర్టు ఆమెకు ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అమన్ జూన్ హత్య అనంతరం తన గ్యాంగ్ లీడర్ హిమాన్షు సూచనల మేరకు అన్ను ధన్‌కఢ్ దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లింది. దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగిందని, ఇక నేపాల్ మీదుగా అమెరికాకు రమ్మని హిమాన్షు సూచించడంతో అన్నూ నేపాల్ సరిహద్దు దగ్గరకు వెళ్లింది. బార్డర్ దాటేందుకు అక్కడ వెయిటింగ్లో ఉండగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది జూన్‌లో జరిగిన అమన్ హత్యలో అన్నూ కీలక పాత్ర పోషించింది. అమన్‌ను పథకం ప్రకారం సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్న అన్నూ బర్గర్ కింగ్ రెస్టారెంట్ దగ్గరకు రమ్మని సూచించింది. అన్నూ సూచన మేరకు అక్కడికి చేరుకున్న అమన్‌ను అప్పటికే అక్కడ కాపుగాచి ఉన్న హిమాన్షు గ్యాంగ్ సభ్యులు హత్యచేశారు.