న్యూఢిల్లీ: దీపావళి వేళ దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం (Delhi Pollution) మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. అనేక చోట్ల వాయు నాణ్యత సూచీ (AQI) 300 మార్కు దాటింది. పటాకుల మోతతో సోమవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ 335గా నమోదయింది. ‘వెరీ పూర్’ కేటగిరీలోకి చేరడంతో ఢిల్లీ నగరంతోపాటు రాజధాని ప్రాంత పరిధిలో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-2 (GRAP-2) నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇక ఆనంద్ విహార్ ప్రాంతంలో 414, వాజీపూర్ ప్రాంతంలో వాయు నాణ్యత 407గా నమోదవడంతో సెవర్ కేటగిరీలో చేరాయి.
రానున్న రోజుల్లో కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంతం అప్రమత్తమైంది. దీంతో నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు. డీజిల్ జనరేట్లర్లు, కట్టెల పొయ్యిపై నిషేధం విధించారు. అదేవిధంగా దుమ్మును నియంత్రించేందుకు ఎంపిక చేసిన రోడ్లను రోజూ ఊడ్చడం, నీళ్లు చల్లడం వంటి చర్యలు తీసుకుంటారు. వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజారవాణాను ప్రోత్సహించేందుకు సీఎన్జీ, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యతోపాటు మెట్రో సేవల ఫ్రీక్వెన్సీని పెంచుతారు. జీఆర్ఏపీ-1 అమల్లోకి వచ్చిన ఆరు రోజుల్లోనే తాజా ఆంక్షలు విధించడం గమనార్హం.
#WATCH | Visuals from the India Gate as GRAP-2 invoked in Delhi.
The Air Quality Index (AQI) around the India Gate was recorded at 347, in the ‘Severe’ category, in Delhi this morning as per the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/5gbpOvT5hp
— ANI (@ANI) October 20, 2025