న్యూఢిల్లీ,: దేశంలో మహిళలకు అత్యంత సురక్షిత నగరాల జాబితాలో కోహిమ, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్టక్, ఇటానగర్, ముంబై ముందు వరుసలో నిలిచాయి. మహిళల రక్షణకు సంబంధించిన సూచీలలో పాట్నా, జైపూర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్కతా, శ్రీనగర్, రాంచీ పూర్తిగా వెనుకబడ్డాయి.
మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక, సూచీ 2025 గురువారం విడుదలైంది. 31 నగరాల్లో 12,770 మంది మహిళలను సర్వే చేసి ఈ నివేదిక రూపొందించారు. లింగ సమానత్వం, పటిష్టమైన పౌర నిర్వహణ, సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ, మహిళల ప్రయాణ సదుపాయాలు, భద్రత వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మహిళల భద్రతకు సంబంధించి నగరాలను నాలుగు విభాగాలుగా విభజించారు.