Delhi Techie : వాళ్లిద్దరూ భార్యాభర్తలు..! ఇద్దరివీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..! దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో నివాసం ఉంటున్నారు. భార్య గురుగ్రామ్ (Gurugram) లోని ఓ ఐటీ కంపెనీ (IT company) లో పనిచేస్తుండగా.. భర్త పుణె (Pune) బేస్డ్ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఇద్దరూ ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ముస్సోరీ (Mussori) కి విహారయాత్రకు వెళ్లారు. రాత్రి ఇద్దరూ మద్యం సేవించి, భోజనం చేసి పడుకున్నారు. ఉదయం భర్త లేచేసరికి భార్య నగ్నంగా ఫ్లోర్‌పై పడివుంది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన రాధా గాయత్రి, సౌమ్య శ్రీచరణ్‌లకు 2025 నవంబర్‌లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఉద్యోగాల్లో బిజీగా ఉన్న ఈ దంపతులు.. జూన్ 14న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీకి విహారయాత్రకు వెళ్లారు. అదేరోజు రాత్రి 11.30 గంటలకు ముస్సోరీలోని తిప్రిదార్లో ఓ హోటల్లో దిగారు. తెల్లవారుజామున 3.30 వరకు ఇద్దరూ మద్యం సేవించారు. ఆ తర్వాత భోజనం చేసి పడుకున్నారు.
ఉదయం భర్త సౌమ్య శ్రీచరణ్ లేచి చూసేసరికి.. రాధా గాయత్రి నగ్నంగా ఫ్లోర్‌పై పడివుంది. భార్య ముక్కు నుంచి రక్తం కారుతూ.. మూత్రం మడుగులో పడివుండటాన్ని చూసి శ్రీచరణ్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే హోటల్ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో అంబులెన్స్‌లో వైద్యసిబ్బందిని తీసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాధాగాయత్రిని పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.