Rahul Gandhi | నిఘావర్గాల హెచ్చరికలతో.. ప్రతిపక్షనేత రాహుల్ నివాసం వద్ద భద్రత పెంపు..!
Rahul Gandhi | పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగుతున్నది. ఆయన ప్రసంగంపై ఇప్పటికే పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హిందూసంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీస్ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది.
Rahul Gandhi | పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగుతున్నది. ఆయన ప్రసంగంపై ఇప్పటికే పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హిందూసంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీస్ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ, ఆయన నివాసం వద్ద భద్రతను పెంచారు. నివాసం వద్ద అదనంగా బలగాలను మోహరించారు. అదే ప్రాంతంస్సిస్తున్న కాంగ్రెస్ నేతలపై సైతం నిఘా వేశారు. కాంగ్రెస్ అగ్రనేత లోక్‌సభలో అధికార పక్షాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్‌పై పలువురు సంస్థల నాయకులు దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులకు అర్ధరాత్రి సమాచారం అందింది.
ఆయనకు వ్యతిరేకంగా బ్యానర్స్, పోస్టర్లు వెలిసే అవకాశం ఉందని తెలిసింది. దాంతో రాహుల్ గాంధీ నివాసం వద్ద అదనంగా రెండు ప్లాటూన్ల బలగాలను మోహరించారు. ఒక్కో ప్లాటూన్‌లో 16 నుంచి 18 మంది పోలీసులు ఉంటారు. అంతే కాకుండా తుగ్లక్ రోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎనిమిది నుంచి 20 మంది అదనపు పోలీసులను మోహరించారు. న్యూఢిల్లీ సరిహద్దులను మూసివే.. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను సైతం పెంచారు. న్యూఢిల్లీ జిల్లా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ దేవేష్ మహాలా సోమవారం రాత్రి జిల్లాలోని అన్ని ఏసీపీలు, పోలీస్ స్టేషన్ ఇన్చార్జిలకు భద్రతను పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. హిందూ సంస్థలపై నిఘా పెట్టడమే కాకుండా.. భవిష్యత్ వ్యూహాలను ఆరా తీయాలని ఆదేశించినట్లు సమాచారం. రాహుల్ గాంధీ నివాసం దగ్గర, ఇతర ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు వేయకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

