Watch: పబ్‌లోకి ప్రవేశంపై ఘర్షణ… కొందరిపై పిడిగుద్దులు కురిపించిన బౌన్సర్లు
ఈ ఫైట్‌లో ఇద్దరు వ్యక్తులతోపాటు ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బౌన్సర్లు తన దుస్తులు చించివేశారని ఆమె ఆరోపించింది.
న్యూఢిల్లీ: పబ్‌లోకి ప్రవేశంపై కొందరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. దీంతో బౌన్సర్లు వారిపై పిడిగుద్దులు కురిపించారు. ఆ పబ్ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలోని నైట్ క్లబ్ వద్ద ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి సౌత్ ఎక్స్‌టెన్షన్‌లోని ఒక పబ్ ప్రవేశం వద్ద కొందరు వ్యక్తులు బౌన్సర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఒక వ్యక్తి చెంపపై బౌన్సర్ కొట్టాడు. అనంతరం వారంతా పబ్ ముందున్న రోడ్డు పైకి చేరారు. అక్కడ ఆ వ్యక్తులు, బౌన్సర్ల మధ్య ఫైటింగ్ జరిగింది. దీంతో ఆ వ్యక్తులకు చెందిన మహిళలు కూడా బౌన్సర్లతో ఘర్షణకు దిగారు. వారిపై కూడా బౌన్సర్లు దాడి చేశారు.
కాగా, ఈ ఫైట్‌లో ఇద్దరు వ్యక్తులతోపాటు ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బౌన్సర్లు తన దుస్తులు చించివేశారని ఆమె ఆరోపించింది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ బౌన్సర్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడి చేసిన బౌన్సర్లు పరారిలో ఉన్నట్లు తెలిపారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు ఆ బార్ యజమాని, కుమారుడు, ఇతర సిబ్బందిపై 2019లో కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తనిఖీ కోసం వెళ్లిన ఎక్సైజ్ అధికారులను పలు గంటలు నిర్బంధించడంతోపాటు సిబ్బందితో దాడి చేయించినట్లు ఆరోపించారు. కాగా, శనివారం రాత్రి ఆ పబ్ వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video: South Delhi Pub's Bouncers Rain Blows After Brawl Over Entry https://t.co/HZYQyCFKFs pic.twitter.com/TZdp2AQVSG
— NDTV (@ndtv) September 25, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

