200 మందికి పైగా నిర్బంధం.. రెండో రోజూ సీజేపీ నిరసనలు
సర్ ప్రక్రియను రద్దు చేయాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రెండో రోజైన ఆదివారం కూడా ఢిల్లీలో నిరసన కొనసాగించింది. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ జంతర్ మంతర్ వైపు దూసుకెళ్తున్న ఆందోళనకారులు 200 మందిని పోలీసులు ఈడ్చుకెళ్లి పోలీస్ బస్సుల్లో పడేశారు.
- సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిరసనకారులను ఈడ్చుకెళ్లిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 11 : సర్ ప్రక్రియను రద్దు చేయాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రెండో రోజైన ఆదివారం కూడా ఢిల్లీలో నిరసన కొనసాగించింది. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ జంతర్ మంతర్ వైపు దూసుకెళ్తున్న ఆందోళనకారులు 200 మందిని పోలీసులు ఈడ్చుకెళ్లి పోలీస్ బస్సుల్లో పడేశారు. ఆదివారం కూడా రాజధానిలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, క్రాంతికారి యువ సంఘటన్ (కేవైఎస్) లాంటి విద్యార్థి సంఘాలతో పాటు సీజేపీ మద్దతుదారులు పెద్దయెత్తున ఆందోళనలో పాల్గొన్నారు. వీరు వివిధ మార్గాల్లో జంతర్ మంతర్ వద్దకు బయలుదేరారు. సీపీఐ (ఎం) రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్ ఆందోళనలో భాగస్వామి కాగా, ఆయనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముఖ్యంగా ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రాజీవ్‌చౌక్ సమీపంలోని కన్నాట్‌ప్లేస్ మీదుగా ఇన్నర్సర్కిల్కు చేరుకోగానే పోలీసులు వారిని చెదరగొట్టారు. వారిలో కొందరిని ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనాలలో వేశారు. కొందరు నిరసనకారులను పోలీసుల నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై ఈడ్చుకు వెళ్లడం కన్పించింది. ఆర్కే ఆశ్రమ్ మార్గ్ మెట్రోస్టేషన్ నుంచి వస్తున్న వారిని కూడా పోలీసులు అడ్డుకుని సుమారు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. వందలాది మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసి నంగ్లోయిలోని సూరజ్మల్ స్టేడియానికి తరలించారని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. అలాగే విజయ్ చౌక్ సమీపంలో ఆందోళనలో పాల్గొన్న ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరాను కూడా అరెస్ట్ చేశారు.
దారుణంగా కొట్టి రోడ్డుపక్కన వదిలేశారు.
నిరసనలో పాల్గొన్న సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై దారుణంగా దాడి చేసి రోడ్డుపక్కన వదిలేశారు. దాడిలో ఆయన తీవ్రంగా గాయపడినట్టు సీపీఎం ఆరోపించింది. ‘ఢిల్లీ పోలీసులు అన్ని హద్దులూ దాటారు’ అని సీపీఎం ఎక్స్ వేదికగా మండిపడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

