CJP protest | సీజేపీ ఆందోళన హింసాత్మకం.. ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
CJP protest : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో సోమవారం ఛలో సంసద్ పేరుతో నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేస్తున్నారు. ఈ హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
CJP protest : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో సోమవారం ఛలో సంసద్ పేరుతో నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీ సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. సీజేపీ కార్యకర్తలపై పోలీసులు, కేంద్ర బలగాలు దాడి చేయగా.. పోలీసులపై కూడా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనల్లో పోలీసు కొన్ని వాహనాలు ధ్వంసంకాగా, పలువురు సిబ్బంది గాయపడ్డారు. దీంతో ఇప్పుడు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేస్తున్నారు.
ఈ హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పోలీసులు, భద్రతా దళాలపై దాడులు, పోలీసు, ప్రభుత్వ వాహనాల ధ్వంసం, ప్రజా ఆస్తుల ధ్వంసం వంటి నేరాలపై ఈ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ ఘటనల్లో మొత్తం 118 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇందులో కొందరు సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు 70 మందికిపైగా ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నౌట్ ప్లేస్ పోలీస్ స్టేషన్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్తోపాటు ఇతర పోలీస్ స్టేషన్లలో ఈ ఐదు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేయడం, హింసకు కుట్ర పన్నడం, సిబ్బందిపై దాడి చేయడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి వాటిపై కూడా కేసు నమోదు చేశారు.
ఆందోళనలో హింసకు పాల్పడిన నిందితుల్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే, మొబైల్ ఫోన్ రికార్డింగ్ వీడియోల్ని కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం 250కిపైగా వీడియోల్ని విశ్లేషిస్తున్నారు. ఈ ఆందోళనకు ప్రాధాన్యం ఇచ్చిన వాట్సాప్ గ్రూపులపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. మరోవైపు సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలో తన చేయి విరిగిపోయిందని ఆర్ఏఎఫ్ అసిస్టెంట్ మహిళా కమాండెంట్ సోనియా షెరావత్ తెలిపారు. సీజేపీ నిరసన సందర్భంగా తొక్కిసలాటలో మహిళా ఆందోళనకారుల్ని రక్షించేందుకు తాను ప్రయత్నించానని, కానీ, తనపై దాడి జరిగిందని ఆమె వివరించారు. మంగళవారం కూడా పలుచోట్ల సీజేపీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

