Online Friendship | న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో స్నేహితుడిగా ఉన్న ఓ వ్యక్తి తనను హోటల్ గదిలో రేప్ చేశాడని ఓ బ్రిటీష్ మహిళ ఢిల్లీ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గురించి ఫిర్యాదు చేయడానికి హోటల్ రిసెప్షన్‌కు వెళుతున్నప్పుడు సాయం చేసే నెపంతో మరో వ్యక్తి అదే హోటల్ లిఫ్ట్‌లో తనను లైంగికంగా వేధించాడని ఆమె పేర్కొంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉన్న మహిపాల్పుర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన నిందితుడితో బ్రిటిష్ మహిళ తరచూ మాట్లాడుతుండేది. ఈ క్రమంలో అతడిని కలవాలని భారత్‌కు వచ్చింది. బుధవారం ఆమెను నిందితుడు హోటల్లో కలిసిన ప్పుడు ఆమెపై నిందితులు లైంగిక దాడులు చేశారు.