Delhi Liquor Case | 2జీ కేసులానే ఇదికూడా ?.. ఢిల్లీ మద్యం కేసుపై నెట్టింట్లో చర్చ
దేశంలో రాజకీయ దుమారం రేపి.. ఏడేండ్లపాటు నడిచిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఎలాంటి కుంభకోణం లేదంటూ 2017లో సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.
Delhi Liquor Case | హైదరాబాద్(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): దేశంలో రాజకీయ దుమారం రేపి.. ఏడేండ్లపాటు నడిచిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఎలాంటి కుంభకోణం లేదంటూ 2017లో సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. అయితే, 2010లో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై ఆరోపణలు వచ్చింది మొదలు.. శూన్యంలో స్కామ్ను సృష్టించి బీజేపీ రాజకీయ లబ్ధిపొందింది.
2014లో కమలదళం అధికారంలోకి రావడానికి కూడా ఈ కేసు ఓ విధంగా సాయపడింది. చివరకు ఈ కేసులో ఏ రాజా, ఎంపీ కనిమొళి, ఇతరులను నిర్దోషులుగా ప్రకటిస్తూ 2017, డిసెంబర్ 21న సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అప్పటివరకూ ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు తర్వాత ఏమీ మాట్లాడలేదు.
ఇప్పుడు ఢిల్లీ మద్యం కేసులోనూ బీజేపీ వైఖరి ఇలాగే ఉన్నదని, ఈ కేసు కూడా 2జీ కేసులాగే నీరుగారొచ్చని సోషల్మీడియాలో చర్చ మొదలైంది. కాగా, 2జీ కేసుపై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 2018లో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను లోక్సభ ఎన్నికల సమయంలో ఇటీవల ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

