న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ఢిల్లీ సీఎం ఆతిశీని తాత్కాలిక సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించడంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామిక స్ఫూర్తిని, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను ఘోరంగా అవమానించడమేనని విమర్శించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు సీఎంగా మిమల్ని నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును, రాష్ట్రపతి ప్రతినిధిగా తనను అవమానించడమేనని ఆతిశీకి రాసిన లేఖలో సక్సేనా పేర్కొన్నారు.