న్యూఢిల్లీ: అల్ ఫలాహ్ యూనివర్సిటీ(Al Falah University) వ్యవస్థాపకుడు జావద్ అహ్మద్ సిద్ధిక్‌ను 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఉగ్ర ఘటనతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో జావద్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 19వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధిక్‌ను 13 రోజుల కస్టడీలోకి పంపిన విషయం తెలిసిందే. కస్టడీ సమయంలో తనకు మెడిసిన, కంటి అద్దాలు ఇవ్వాలని కోరుతూ సిద్దిక్ తరపున న్యాయవాది కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఆయన రిక్వెస్ట్‌కు జడ్జి అనుమతి ఇచ్చారు.