Delhi High Court | న్యూఢిల్లీ : మహిళ వివేకంతో ఆలోచించి, పర్యవసానాల గురించి తెలిసి, ఓ పురుషునితో శారీరక సంబంధం ఏర్పాటు చేసుకుంటే, ఆమె అతనిని అపార్థం చేసుకోవడం వల్ల లేదా భ్రమతో ఈ సమ్మతి తెలిపిందని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
పెళ్లి చేసుకుంటానని ఆ వ్యక్తి తప్పుడు వాగ్దానం చేసినట్లు స్పష్టమైన సాక్ష్యాధారాలు లేనిదే, ఆమె అతనిని అపార్థం చేసుకోవడం వల్ల అతనితో శారీరక సంబంధం ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పలేమని పేర్కొంది. తనతో సహజీవనం చేసిన వ్యక్తి తనను వివాహం చేసుకుంటానని తనపై అనేకసార్లు లైంగిక దాడి చేసినట్లు ఆరోపిస్తూ మహిళ పెట్టిన రేప్ కేసును కొట్టివేసింది.