Delhi High Court | దానిపై 10 రోజుల్లోగా నిర్ణయం తీసుకోండి.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం
Delhi High Court | దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యాలయం నిర్మాణం కోసం తాత్కాలికంగా భూమి కేటాయించే విషయంపై 10 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Delhi High Court : దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యాలయం నిర్మాణం కోసం తాత్కాలికంగా భూమి కేటాయించే విషయంపై 10 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని జాతీయ పార్టీలకు కేటాయించినట్లుగా తమకు కూడా ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని ఆప్ కేంద్రాన్ని కోరుతూ వస్తున్నది.
అయితే కేంద్రం ఆప్ అభ్యర్థనను పెడచెవిన పెడుతుండటంతో విషయం ఢిల్లీ హైకోర్టు దాకా వెళ్లింది. తమకు పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం భూమి కేటాయించేలా కేంద్రాన్ని ఆదేశించాలని ఆప్ కోరింది. దాంతో కోర్టు కేంద్రం నుంచి వివరణ కోరగా.. కేంద్రం సమయం పడుతుందని చెప్పింది. దాంతో శాశ్వత స్థలం కేటాయించేవరకు తాత్కాలికంగానైన స్థలం చూపించాలని ఆప్ కోరింది.
ఆప్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్రానికి తాజా ఆదేశాలు ఇచ్చింది. వాస్తవానికి కేంద్రం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల సమయం కావాలని కోరింది. కానీ కోర్టు మాత్రం కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. కేసు తదుపరి విచారణను జూలై 25 వరకు వాయిదా వేసింది. ఆ రోజు కేంద్రం ఆప్‌కు తాత్కాలిక స్థలం కేటాయింపుపై నిర్ణయం వెల్లడించాల్సి ఉంటుంది.
Read More
Pakistan | అచ్చుగుద్దినట్టు అనుకరిస్తున్నాడు.. పాక్‌లో యంగ్ బుమ్రా.. వీడియో
SBI | రుణగ్రహీతలకు ఎస్బీఐ షాక్.. వడ్డీరేట్లు 10 బేసిస్ పాయింట్లదాకా పెంపు
Janhvi Kapoor | అమ్మ కోరికను తీరుస్తున్న జాన్వి కపూర్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

