Mobiles Ban | అక్కడి స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం.. ఆదేశాలు జారీ చేసిన సర్కార్!
Mobiles Ban | ఢిల్లీ స్కూళ్లలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్ల వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
Mobiles Ban | మొబైల్ ఫోన్లపై ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. క్లాస్ రూమ్స్, లైబ్రరీలు, ప్లే గ్రౌండ్స్తోపాటు పాఠశాలల పరిధిలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు కూడా మొబైల్ ఫోన్లు వాడరాదని ఢిల్లీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు, విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్లో 17 ఏండ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ అరెస్టయిన నేపథ్యంలో స్కూల్ ఆవరణల్లో మొబైల్ ఫోన్లు వాడొద్దని ఆదేశాలివ్వాలని అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల యాక్షన్ కమిటీ, ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్ విజ్ఞప్తులు చేశాయి. ఆ విజ్ఞప్తుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ డైరెక్టరేట్ డైరెక్టర్ హిమాంశు గుప్తా తెలిపారు. స్కూళ్లలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసినందుకు ఢిల్లీ విద్యాశాఖ డైరెక్టరేట్కు అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల యాక్షన్ కమిటీ అధ్యక్షుడు భరత్ అరోరా ధన్యవాదాలు తెలిపారు.
విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఇవ్వరాదు. ఒక వేళ విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకొచ్చినా.. సురక్షితంగా నిల్వ చేసేందుకు లాకర్లను ఏర్పాటు చేయాలని స్కూళ్ల యాజమాన్యాలకు ఢిల్లీ సర్కార్ ఆదేశాలిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

