Delhi : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం తీవ్రత, పెల్లుబికుతున్న నిరసనల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో నగరం గ్యాస్ ఛాంబర్లా మారిన వేళ ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ఇవ్వాలని ఆదేశించింది. తమ ఉద్యోగుల్లో సగం మందిని ఇంటి నుంచే పని చేసేలా.. మిగతా సగం మంది ఆఫీసుకు వచ్చేలా చూడాలని ఆయా సంస్థలను కోరింది ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 లోని సెక్షన్ 5లో పేర్కొన్న నిబంధలన ప్రకారం పర్యావరణ శాఖ, అటవీ శాఖ ప్రైవేట్ కంపెనీలకు ఈ ఆదేశాలను జారీ చేసింది.
ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. చలికాలంలో కాలుష్యం తీవ్రత ఆందోళన రేకెత్తిస్తోంది. PM2.5, PM10 నిర్ణీత మోతాదు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. దాంతో, రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం కాలుష్య నియంత్రణ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగుల్లో సగం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించాలని సదరు సంస్థలకు ఢిల్లీ గవర్నమెంట్ తేల్చి చెప్పింది.
Offices To Work At 50% Strength, WFH For Rest As Toxic Air Chokes Delhi https://t.co/cId88Lls0k pic.twitter.com/eB3QvzKB4R
— NDTV (@ndtv) November 24, 2025
ఢిల్లీని 1987లో కాలుష్య నియంత్రణ ప్రాంతాల జాబితాలో చేర్చారు. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ సూచలను అనుసరించి ఢిల్లీలో గ్రేడ్ రెస్పార్స్ యాక్షన్ను పూర్తి చేశారు అధికారులు. నగరంలో కాలుష్య నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని వేలాది మంది ఇండియా గేట్ వద్ద నిరసనలకు దిగారు. అయితే.. నిరసనకారులపై పోలీసులు దాడి చేశారని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఆదివారం చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Anand Vihar,Delhi covered with toxic smog blanket with AQI 440
even after 50% work from home & lower stuble burning
-Kids can’t breathe
-schools shut
-traffic chaosWhere’s BJP Govt?
Busy in preparations for Bengal
Har haal mein Bhagwa lehrana h🙄pic.twitter.com/zFas5uxwmv— Avishek Goyal (@AG_knocks) November 23, 2025