సునంద పుష్కర్ మృతి కేసు.. తీర్పు ఆగస్టు 18కి వాయిదా..!
Sunanda Pushkar death case: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో తీర్పును ఢిల్లీ కోర్టు వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో తీర్పును ఢిల్లీ కోర్టు వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఆ లోగా ఢిల్లీ పోలీసులు కేసుకు సంబంధించిన అదనపు డాక్యుమెంట్లను సమర్పించేందుకు అనుమతి ఇచ్చింది. సునంద పుష్కర్ 2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోస్టు మార్టం రిపోర్టులో ఆమె విషం సేవించి ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.
దాంతో పోలీసులు అది ఆత్మహత్యగా పేర్కొంటూ కేసు నమోదు చేయగా, సునంద పుష్కర్ కుటుంబసభ్యులు మాత్రం ఆమెను ఆమె భర్త శశిథరూరే విషమిచ్చి చంపేశాడని ఆరోపించారు. ఈ కేసుపై గత ఏడేండ్లుగా ఢిల్లీ కోర్టులో పలు దఫాల్లో విచారణ జరిగింది. ఇవాళ తీర్పు వెలువరించాల్సి ఉండగా.. ఢిల్లీ పోలీసులు కేసుకు సంబంధించి మరికొన్ని అదనపు డాక్యుమెంట్లను సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దాంతో కోర్టు అందుకు అనుమతి ఇస్తూ తీర్పును ఆగస్టు 18వ తేదీకి వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

