Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Iran | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) దాటడం కోసం భారత నౌకల (India ships) కు ఇరాన్ (Iran) ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. భారత్ (India) సహా తమ మిత్రదేశాల నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్ (Ameer Hayat) పేర్కొన్నారు.
Iran : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) దాటడం కోసం భారత నౌకల (India ships) కు ఇరాన్ (Iran) ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. భారత్ (India) సహా తమ మిత్రదేశాల నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్ (Ameer Hayat) పేర్కొన్నారు. ఇతర దేశాల వాణిజ్య నౌకల (Trade Ships) పై విధించిన ఆంక్షలు లేకుండానే.. ఇక నుంచి భారత్ (India), చైనా (China), ఇరాక్ (Iraq), ఖతార్ (Qatar) నౌకలు హర్మూజ్ జలసంధిని దాటవచ్చని స్పష్టంచేశారు.
భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకు ఔషధాల సరఫరాను సులభతరం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమీర్ హయత్ తెలిపారు. అయితే ఆయా దేశాల నౌకల నుంచి రవాణా రుసుమును మాత్రం వసూలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం హర్మూజ్‌లో రవాణా ఆంక్షల నుంచి భారత్, చైనా, ఇరాక్, ఖతార్లకు మినహాయింపు ఇచ్చామని, ఇకపై ఆయా దేశాల నౌకలు జలసంధిలో స్వేచ్ఛగా ప్రయాణిస్తాయని, అమెరికన్లు కూడా వాటిని అడ్డుకోరని హయత్ తెలిపారు. ఇరాన్ దౌత్య, ఆర్థిక ప్రయోజనాలకు దోహదం చేస్తాయనే కారణంతోనే ఈ మినహాయింపులు ఇచ్చామని చెప్పారు.
భారత్ నుంచి ఔషధాల దిగుమతిని సులభతరం చేయడానికి, చైనా నుంచి రాజకీయ మద్దతు పొందడానికి ఈ చర్యలు చేపట్టామని అమీర్ హయత్ పేర్కొన్నారు. ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గంగా ఉన్న హర్మూజ్‌లో నౌకాయానంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సహా మిత్రదేశాల నౌకలకు ఇరాన్ ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం గమనించవలసిన విషయం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

