Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Panchayat Secretaries | చుంచుపల్లి మండలంలోని గ్రామపంచాయతీల్లో ఉదయం 10:30 గంటలకే కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
Panchayat Secretaries | చుంచుపల్లి, నవంబర్ 4: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ చుంచుపల్లి మండలంలోని కొందరు పంచాయతీ కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాంపురం, అంబేద్కర్ నగర్ గ్రామపంచాయతీల్లో ఉదయం 10:30 గంటలకే కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలున్నాయి. కార్యదర్శులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ విషయంపై ఎంపీడీవో సుభాషిణి స్పందిస్తూ.. రాంపురం కార్యదర్శి ఆరోగ్యం బాగోలేక అనుమతి తీసుకుని వెళ్లారని, ప్రస్తుతం క్యాంప్ కార్యదర్శి బాబుని అక్కడికి పంపిస్తానని తెలిపారు. అంబేద్కర్ నగర్ కార్యదర్శి వ్యవహారంపై విచారణ చేసి చెబుతానన్నారు. కార్యదర్శులు సైతం వ్యక్తిగత కారణాలతో అనుమతి తీసుకుని వెళ్లినట్లు వివరణ ఇచ్చారు.
ప్రజలకు అవసరమైన సమయంలో అధికారులు అందుబాటులో లేకపోతే సమస్యలు పరిష్కరించేదెవరని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read Also :
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

