న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా(Delhi CM Rekha Gupta) ఇవాళ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అని వెల్లడించారు. వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని సూచించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం వినియోగం తగ్గించుకోవాలని ప్రధాని మోదీ కొన్ని పొదుపు చర్యలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు చర్యలు చేపట్టింది. ఆఫీసర్ల వాహనాలకు చెందిన పెట్రోల్, డీజిల్ కోటాను 20 శాతం కోత విధించారు. అన్ని మంత్రిత్వ శాఖలకు చెందిన ఆఫీసర్లు సోమవారం రోజు మెట్రో వాడాలని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సూచన చేశారు.