Delhi CM | ఢిల్లీలో ఈ నెల 19 లేదా 20న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..!
Delhi CM | ఫలితాలు వెలువడి వారం రోజులైనా ఢిల్లీ సీఎం ఎవరనే విషయాన్ని బీజేపీ ఇంకా తేల్చలేదు. కొత్త ప్రభుత్వం (New Government) ఎప్పుడు కొలువుదీరబోతోందనే విషయంలో కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
Delhi CM : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాలు వెల్లడై వారం రోజులు పూర్తయింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘోర పరాభవం పాలైంది. బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఫలితాలు వెలువడి వారం రోజులైనా సీఎం ఎవరనే విషయాన్ని బీజేపీ ఇంకా తేల్చలేదు. కొత్త ప్రభుత్వం (New Government) ఎప్పుడు కొలువుదీరబోతోందనే విషయంలో కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన ప్రకారం.. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ఏదో ఒకరోజు కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్, అమెరికా పర్యటనలు ముగించుకుని శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతారు. ప్రధాని ఢిల్లీకి రాగానే హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ బీజేపీ నేతలతో సమావేశమై ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గం కూర్పుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అనంతరం లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది. ఫిబ్రవరి 17న గానీ, 18న గానీ బీజేపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. తమ నాయకుడిని ఎన్నుకోనుంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ తరఫున గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో 15 మంది పేర్లను బీజేపీ ఇప్పటికే షార్ట్ లిస్టు చేసినట్లు తెలుస్తోంది. వారిలో 9 మందిని సీఎం, అసెంబ్లీ స్పీకర్, క్యాబినెట్ స్థానాలకు ఎంపిక చేయనుంది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ సీఎం రేసులో మొదటి స్థానంలో ఉన్నారు. తక్కిన వారిలో పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేంద్ర సచ్దేవ, బన్సూరి స్వరాజ్, సతీష్ ఉపాధ్యాయ్ తదితరులు ఉన్నారు.
ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను 48 స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. మరోసారి అధికారంలోకి రావాలనుకున్న ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా కనీసం ఖాతా తెరువలేకపోయింది.
ఇవి కూడా చదవండి..
Heatwaves | వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి : సందీప్ కుమార్ ఝా
Abhinav Singh | ఏడాది క్రితం అలా.. ఇప్పుడిలా.. ర్యాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య
Puja Khedkar: పూజా ఖేద్కర్‌ను మార్చి 17 వరకు అరెస్టు చేయవద్దు: సుప్రీంకోర్టు
TG High Court | హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులు.. ప్రమాణం చేయించిన సీజే సుజయ్ పాల్
MS Narayana | ఎంఎస్ నారాయణ చివరి క్షణంలో నన్ను చూడాలి అనుకున్నాడు : బ్రహ్మానందం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

