న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇవాళ ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో స్మాగ్ టవర్‌ను ప్రారంభించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏటికేడు తీవ్రమవుతుండటంతో స్మాగ్ టవర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆప్ సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు ఇవాళ కన్నాట్ ప్లస్‌లో మొదటి స్మాగ్ టవర్‌ను ప్రారంభించింది. స్మాగ్ టవర్‌ను ప్రారంభించిన అనంతరం కేజ్రివాల్ మాట్లాడుతూ.. ఇకపై ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్‌కు అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
కాలుష్యంపై పోరాటంలో భాగంగా ఇవాళ తాము దేశంలో తొట్టతొలి స్మాగ్ టవర్‌ను ఢిల్లీలో ప్రారంభించామని, ఈ స్మాగ్ చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిలో గాలిని శుభ్రం చేస్తుందని కేజ్రివాల్ తెలిపారు. ప్రయోగాత్మకంగా తాము ఈ స్మాగ్ టవర్‌ను ప్రారంభించామని, ఈ స్మాగ్ టవర్ పనితీరుకు సంబంధించిన డేటాను ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే పరిశీలించనున్నాయని ఆయన చెప్పారు. ఆ డాటా ఆధారంగా భవిష్యత్తులో స్మాగ్ టవర్ల ఏర్పాటుపై నిర్ణంయ తీసుకుంటామన్నారు.
Delhi CM Arvind Kejriwal inaugurates smog tower at Connaught Place pic.twitter.com/MLK4RbBLg5
— ANI (@ANI) August 23, 2021