Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీ కారు బాంబు దాడితో ఉలిక్కి పడింది. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద సంభవించిన కారు బాంబు పేలుడు ఇప్పటివరకూ పది మందిని పొట్టన బెట్టుకుంది. అసలు ఏం జరిగిందో అర్ధమయ్యేలోపే.. 24 మంది గాయపడ్డారు. భీతి గొలిపించిన ఈ పేలుడు నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు కొందరు. పలువురిని బలిగొన్న ఈ పేలుడు నుంచి కొద్దిలో తప్పించుకున్న ప్రత్యక్ష సాక్షి అసలు ఏం జరిగిందో చెప్పాడు.
‘మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. నా జీవితంలో ఇప్పటివరకూ అంత భారీ శబ్దం నేను వినలేదు. భారీ శబ్దానికి భూమి కుంగిపోయిందేమోనని అనకున్నా. పేలుడు శబ్దం వినగానే చాలామంది భయంతో పరుగులు తీశారు. పరుగెత్తే క్రమంలో నేను మూడుసార్లు కింద పడ్డాను. ఇక నా పనైపోయింది. నేను చనిపోతానని అనుకున్నా. ప్రాణ భయంతో పరుగులు తీస్తూ పలువురు ఒకరిమీద ఒకరు పడ్డారు. ఒకవేళ రెండో పేలుడు కూడా సంభవిస్తే మేమంతా చచ్చిపోతామని అందరం అనుకున్నాం’ అని ప్రత్యక్ష సాక్షి మీడియాతో వెల్లడించాడు.
#WATCH | Delhi: “I never heard such a loud explosion ever in my life. I fell three times due to the explosion. It felt as if we were all going to die…” said a local shopkeeper to ANI https://t.co/mNFJMPex0i pic.twitter.com/KQcbOYYNu6
— ANI (@ANI) November 10, 2025
బాంబు పేలుడు, జనాలు పరుగెత్తడం చూసిన మరో వ్యక్తి మాట్లాడుతూ.. ‘నేను మా ఇంటి డాబా మీద ఉన్నాను. అప్పుడే నాకు పెద్ద పేలుడు వినిపించింది. పెద్దగా మంటలు కనిపించాయి. ఏం జరిగిందో తెలుసుకోవాలని వెంటనే కిందకు వెళ్లాను. ఆ బాంబు పేలుడు ధాటికి మా ఇంటి కిటీకిలు దెబ్బతిన్నాయి’ అని చెప్పాడు.
Delhi Police Commissioner Satish Golcha on Delhi Bomb Blast#DelhiBlast #RedFort #BreakingNews #Delhi #IndiaNews #NationalAlert #DelhiPolice #Faridabad #SecurityAlert #northeastscoop pic.twitter.com/oiEc02kWXW
— Northeast Scoop (@ScoopNE) November 10, 2025
ఈ ఘటన గురించి ఢిల్లీ సీపీ శ్రీ సతీశ్ గొల్చా (Shri Satish Golchha) వివరాలు వెల్లడించారు. సాయంత్రం 6:52 గంటలకు పేలుడు జరిగిందని ఆయన చెప్పారు. పేలుడు ధాటికి సమీపంలోని దుకాణాలు దెబ్బతిన్నాని తెలిపారు. ఎర్రకోట సిగ్నల్ వద్ద నిదానంగా వచ్చిన కారు. సిగ్నల్ లైట్ దగ్గర ఆగుతుండగానే ఒక్కసారిగా కారులో పేలుడు సంభవించింది. ఘటనాస్తలికి ఎన్ఐఏ, ఫొరెన్సిక్ బృందాలు చేరుకున్నాయి అని సీవీ వెల్లడించారు.