IndiGo Flight: గాలిలో ఉండగా ఇంజిన్ ఫెయిల్యూర్.. గోవాలో విమానం అత్యవసర ల్యాండింగ్
IndiGo Flight: గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానం గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ ఫైల్యూర్ అయినట్లు తెలిసింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇవ్వడంతో.. మళ్లీ ఆ విమానాన్ని గోవా విమానాశ్రయంలో దించారు.
న్యూఢిల్లీ: గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానం(IndiGo Flight) అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఆ విమానం గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ ఫైల్యూర్ అయినట్లు తెలిసింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇవ్వడంతో.. మళ్లీ ఆ విమానాన్ని గోవా విమానాశ్రయంలో దించారు. ఇండిగో విమానం 6ఈ 2102 ఇవాళ ఉదయం 9.16 నిమిషాలకు గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో దాన్ని మళ్లీ గోవాకు మళ్లించారు.
ఉదయం 9.30 నిమిషాలకు ఏటీసీ ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తగా గోవాలో ల్యాండ్ చేశారు. రన్‌వే 28పై ఉదయం 9.51 నిమిషాలకు విమానాన్ని ల్యాండ్ చేశారు. స్టాండ్6లో దాన్ని పార్క్ చేశారు. ప్రయాణికులను ఆ విమానం నుంచి దింపి.. బోర్డింగ్ ఏరియాలో అకామిడేట్ చేశారు. ఫ్లయిట్‌రేడార్24 డేటా ప్రకారం దక్షిణ మహారాష్ట్ర తీరం నుంచి గోవాకు ఆ విమానం దారి మళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో విమానం సుమారు 14వేల ఫీట్ల ఎత్తులో ప్రయాణిస్తున్నది. ఫ్లయిట్‌ను సాయంత్రం 3.30 నిమిషాలకు రీషడ్యూల్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

