న్యూఢిల్లీ, నవంబర్ 11: ఢిల్లీ బాంబు పేలుడు ఘటన ఎంతోమంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చాందినీ చౌక్‌కు చెందిన వ్యాపారవేత్త 34 ఏండ్ల అమర్ కటారియా ప్రాణాలు కోల్పోగా, శరీరంపై అమ్మా, నాన్న, కృతి(భార్య పేరు).. అనే పదాలతో ఉన్న టాటూస్‌తో అతడు ఎవరన్నది అధికారులు గుర్తించారు. ‘మామ్ మై ఫస్ట్ లవ్’, ‘డాడ్ మై స్ట్రెంగ్త్’..‘కృతి’..అని టాటూస్ వేసుకున్న అమర్ కటారియా మరణం.. అక్కడి వారందర్నీ కదిలించింది. మంగళవారం ఉదయం దవాఖాన నుంచి తమకు ఫోన్ వచ్చినట్టు మృతుడి తండ్రి చెప్పారు.