న్యూఢిల్లీ: ఎర్రకోట సమీపంలో సూసైడ్ బాంబింగ్ నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్-ఉన్-నబీ అలియాస్ ఉమర్ మహ్మద్‌కు చెందిన పుల్వామాలోని అతని ఇంటిని భద్రతా బలగాలు శుక్రవారం బాంబులతో పేల్చేశాయి. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో భాగంగానే ఆ ఇంటిని ఐఈడీలతో పేల్చివేసినట్టు భద్రతా బలగాలు తెలిపాయి.
ఈ దాడిలో అతని కచ్చితమైన పాత్రను నిర్ధారించడానికి ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతున్నది. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇదో సందేశాత్మకమైన హెచ్చరిక అని ఒక అధికారి పేర్కొన్నారు.