Delhi Blast | ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఓ ఇంటర్నల్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP), అంతకంటే ఎక్కువ స్థాయి అధికారి నేతృత్వం వహించనున్నారు. సోమవారం జరిగిన బాంబు పేలుడు విచారణను హోం మంత్రిత్వశాఖ మంగళవారం ఎన్ఐఏకి అప్పగించింది. నిఘా వర్గాలు దీన్ని ఉగ్రవాద దాడిగా భావిస్తూ ఉపా (UAPA) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశాయి. ఆ తర్వాత రంగంలోకి దిగిన ఎన్ఐఏ వివరణాత్మక దర్యాప్తును ప్రారంభించింది. ఈ ఏజెన్సీ కేసు దర్యాప్తులో దర్యాప్తులో భాగంగా ఇతర కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నది.
పేలుడు ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా? అనే దానితో సహా పలు అంశాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేయనున్నది. ఫరీదాబాద్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిని అరెస్టు చేసి భారీ కుట్రను భగ్నం చేశారు. ఢిల్లీ పేలుడు సైతం ఇదే మాడ్యూల్ భాగంగా భావిస్తున్నారు. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు జమ్మూ కశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో వెలసిన పోస్టర్లకు సంబంధించిన ఘటనతోనూ సంబంధం ఉందని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 20 నుంచి 27 మధ్య అరెస్టయిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ వాఘయ్, పోస్టర్లను అతికించిన సంఘటనతో ముడిపడి ఉందని ఏజెన్సీలు స్పష్టం చేశాయి. 2025 అక్టోబర్ 20 మరియు 27 మధ్య అరెస్టయిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ వాఘయ్ (షోపియన్), జమీర్ అహ్మద్ (గందర్బాల్) పాత్రపై సైతం ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది.
#WATCH | Delhi: NIA officials leave from the spot where a blast occurred in a Hyundai i20 car near the Red Fort on 10th November. Eight people died in the blast. pic.twitter.com/ttpAEWPCDI
— ANI (@ANI) November 12, 2025