Delhi blast case : ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడి (Suicide attack) కేసులో నలుగురు నిందితులకు ఎన్ఐఏ కస్టడీని పొడిగించారు. ఆ నలుగురికి ఇప్పటికే విధించిన నాలుగురోజుల కస్టడీ ముగియడంతో దర్యాప్తు అధికారులు వారిని ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎన్ఐఏ అధికారుల అభ్యర్థన మేరకు కోర్టు వారిని కస్టడీని పొడిగించింది.
కస్టడీని పొడిగించబడిన నిందితుల్లో డాక్టర్ ముజామిల్ గనయా, డాక్టర్ ఆదిల్ రాథర్, డాక్టర్ షాహీనా సయీద్, మత ప్రచారకుడు మౌల్వీ ముఫ్తీ ఇఫ్రాన్ అహ్మద్ ఉన్నారు. పటియాలా హౌస్ కోర్టులోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో నిందితులను తాము ప్రవేశపెట్టామని, కోర్టు వారి కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించిందని అధికారులు వెల్లడించారు.
నిందితులకు కోర్టు గతంలో జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ కస్టడీ ముగియడంతో ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టగా 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఇచ్చింది. ఇప్పుడు ఆ 10 రోజుల కస్టడీ ముగియడంతో మరో నాలుగు రోజులు పొడిగించింది.
కాగా ఎర్రకోట సమీపంలో గత నెలలో ఓ ఉగ్రవాది కారులో పేలుడు పదార్థాలతో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.
#WATCH | Delhi terror blast case | Special NIA court extends the NIA custody of Dr. Muzammil, Dr Adeel, Mufti Irfan and Dr. Shaheen Saeeda for four days.
They were produced before the Special NIA court in Patiala House court complex in Delhi. pic.twitter.com/ZokOZgj6bO
— ANI (@ANI) December 8, 2025