భోపాల్: ఒక బీజేపీ ఎమ్మెల్యే విద్యార్థులకు వింత సలహా ఇచ్చారు. డిగ్రీల వల్ల ఏ ఉపయోగం లేదన్నారు. ఈ నేపథ్యంలో పంక్చర్ షాప్ తెరుచుకోవాలని స్టూడెంట్స్‌కు సూచించారు. (open puncture shop) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. గుణ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ షాక్యా ఆదివారం ‘పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ షాక్యా మాట్లాడారు. డిగ్రీలు పొందడం వల్ల ఏమీ లాభం లేదని తెలిపారు. విద్యార్థులు జీవనోపాధి పొందేందుకు మోటార్‌సైకిల్ పంక్చర్ రిపేర్ దుకాణాన్ని తెరవాలని సూచించారు. ‘మేం ఈరోజు పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభిస్తున్నాం. ఈ కాలేజీ డిగ్రీలతో ఏమీ జరుగదు. ఒక వాక్యాన్ని గుర్తుంచుకోవాలని నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. డిగ్రీలకు బదులుగా, జీవనోపాధి కోసం కనీసం మోటార్‌సైకిల్ పంక్చర్ రిపేర్ షాప్ తెరవండి’ అని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.
#WATCH | ‘College Ki Degree Se Kuch Nahi Hone Wala, Ek Puncture Ki Dukaan Khol Lena’: BJP MLA Pannalal Shakya’s Bizarre Statement While Addressing Public In MP’s Guna #MadhyaPradesh #MPNews pic.twitter.com/UwMxQ7H7v5
— Free Press Madhya Pradesh (@FreePressMP) July 15, 2024