ముంబై: రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ ఉదయగిరి ఇవాళ జలప్రవేశం చేశాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయగిరి, సూరత్ ఆవిష్కరణతో భారత్ నౌకా నిర్మాణంలో కొత్త అధ్యాయం మొదలైనట్లు రాజ్నాథ్ తెలిపారు. ప్రపంచ దేశాలకు అవసరమైన నౌకలను నిర్మించే సత్తా మనకు ఉందన్నారు. మేకిన్ ఇండియా మాత్రమే కాదు, మేక్ ఫర్ వరల్డ్ లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.