కర్ణాటక హైకోర్టు తీర్పు
బెంగళూరు, సెప్టెంబర్ 29: తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలన్న రేపిస్టు, సీరియల్ కిల్లర్ ఉమేశ్ రెడ్డి పిటిషన్ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. ఉమేశ్ రెడ్డి సంచార జీవితం గడుపుతూ పలు రాష్ర్టాల్లో 20 మందికిపై మహిళలపై లైంగిక దాడికి పాల్పడి వారిని హత్య చేశాడు. పోలీసులు 1997లో మొదటిసారి అతన్ని అరెస్టు చేశారు. మూడు సార్లు జైలు నుంచి పారిపోయాడు. జైలు నుంచి తప్పించుకొంటూ నేరాలకు పాల్పడ్డాడు. ఉమేశ్ రెడ్డికి సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. అతని క్షమాభిక్ష పిటిషన్ను ఇప్పటికే రాష్ట్రపతి కోవింద్
తిరస్కరించారు.