న్యూఢిల్లీ, డిసెంబర్ 31: వచ్చే ఏడాది జనవరి నుంచి డీఏపీ ఎరువు ధరలు పెరగనున్నాయి. ఒక్కో బ్యాగ్‌పై సుమారు రూ.200కు పైగా పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. రూపాయి బలహీనత కారణంగా డీఏపీ దిగుమతి ధర ప్రతి టన్నుకు రూ.1200 పెరిగింది. ప్రస్తు తం అంతర్జాతీయ విపణిలో డీఏపీ టన్ను ధర 630 డాలర్లు ఉంది.
ప్రతి టన్నుపై ప్రభుత్వం ఇచ్చే రూ.3500 ప్రోత్సాహకం గడువు డిసెంబర్ 31తో పూర్తవుతుంది. ఈ రెండు కారణాలతో ప్రతి టన్నుకు రూ.47 00 ధరను రైతు చెల్లించాల్సి ఉం టుంది. దీంతో ప్రతి బ్యాగ్‌పై రూ.23 5 అదనపు భారం పడుతుంది. ప్రస్తుత రబీ సీజన్లో డీఏపీ ఎరువుకు సంక్షోభం ఏర్పడింది. అంతర్జాతీయంగా వీటి ధరల పెరగడంతో దిగుమతులు గణనీయంగా తగ్గి దీనికి కొరత ఏర్పడింది.