Dana Cyclone | వాయవ్వ బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తీవ్ర తుఫాను (Cyclone Dana) తీరందాటింది. గురువారం అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 గంటల మధ్య ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య తీరం దాటింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. దీంతో తీరంలో అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. తీరప్రాంత జిల్లాలైన భద్రక్, జగత్సింగ్పుర్, ధర్మ, బాలాసోర్, కేంద్రపరాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల్లో వేల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. కాగా, దానా తుపాను శుక్రవారం తెల్లవారుజామున ఒడిశా తీరాన్ని దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలిన తుఫాను, కేంద్రపరా జిల్లాలోని భితార్కానికా, భద్రక్‌లోని ధమ్రా మధ్య తీరాన్ని తాకినట్లు వెల్లడించింది.
తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం ఏడు వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని హైరిస్క్ జోన్ల నుంచి 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక బెంగాల్లో కూడా దానా తుఫాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల నుంచి 3.5 లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో శుక్రవారం స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తుఫాను ప్రభాను ప్రభావం విమానాల రాకపోకలపై పడింది. భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, కోల్‌కతా ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేశారు. 4 వేల రైళ్లను రద్దు చేశారు.
#WATCH | Odisha: Gusty winds and heavy downpour cause destruction in Bhadrak’s Kamaria
The landfall process of #CycloneDana continues pic.twitter.com/TkER0KF32m
— ANI (@ANI) October 24, 2024
#WATCH | Odisha: Gusty winds and heavy downpour cause destruction in Vansaba, Bhadrak
The landfall process of #CycloneDana underway pic.twitter.com/HFZwDSOLdx
— ANI (@ANI) October 25, 2024
#WATCH | Gusty winds and heavy rain continue to lash parts of Odisha; landfall process of #CycloneDana underway
(Visuals from Dhamra, Bhadrak) pic.twitter.com/HqEhW5sT6L
— ANI (@ANI) October 25, 2024
#WATCH | Heavy rainfall and gusty winds continue to lash parts of Odisha; landfall process of #CycloneDana underway
(Visuals from Bhadrak) pic.twitter.com/l5N3iRp66X
— ANI (@ANI) October 25, 2024
#WATCH | Odisha: Strong winds and downpour persist in Bhadrak as landfall process of #CycloneDana is underway pic.twitter.com/QPunxpCIIQ
— ANI (@ANI) October 24, 2024