భోపాల్, ఆగస్టు 7: బీజేపీపాలిత మధ్యప్రదేశ్లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కాబోయే భర్తతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ దళిత మహిళ (20)పై కొంతమంది యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. కాబోయే భర్తపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్టు తెలిసింది.
మధ్యప్రదేశ్ సిధి జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో అధికార బీజేపీపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించినందు వల్లే, నేరాలు పెరిగాయని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించాయి.