బారాబంకీ(యూపీ), జూన్ 23: తనపై జరిగిన లైంగిక దాడి కేసులో కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాల్సిన 16 ఏండ్ల దళిత బాలిక చెట్టుకు ఉరేసుకొన్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హైదర్గర్గ్లో చోటు చేసుకొంది. ఎస్పీ దినేశ్‌కుమార్ సింగ్ కథనం ప్రకారం ఈ నెల 21న ఈ ఘటన జరిగిందని, దీనికి సంబంధించిన విచరణాధికారిని సస్పెండ్ చేశామని తెలిపారు. ఈ నెల 17న లైంగిక దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని, అయితే అతడు ఉపయోగించిన పిస్తోలు స్వాధీనం చేసుకోవడానికి అతడిని బెహ్తా గ్రామానికి తీసుకెళ్లినప్పుడు, తుపాకీతో సహా అతడు తప్పించుకొని పోయాడని చెప్పారు. మృతురాలి శవాన్ని శవ పరీక్షకు పంపించామని తెలిపారు.