లక్నో: గ్రామస్తులకు సహాయం చేస్తున్న దళిత వ్యక్తిని ఒక వ్యక్తి కొట్టాడు. అంతేగాక అతడితో బలవంతంగా తన చెప్పును నాకించాడు (Dalit man forced to lick slippers). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఈ దారుణం జరిగింది. దళిత వ్యక్తి రాజేంద్ర ఇటీవల తన బంధువుల గ్రామానికి వెళ్లాడు. వారి ఇంట్లోని విద్యుత్ సమస్యను పరిష్కరించాడు. ఈ విషయం తెలిసిన కొందరు గ్రామస్తులు తమ ఇళ్లలో కరెంట్ సమస్యలపై అతడ్ని సంప్రదించారు. కరెంట్ పనులు చేసినందుకు సర్వీస్ ఛార్జీగా డబ్బులు ఇచ్చారు.
కాగా, ఆ గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్మెన్గా పనిచేస్తున్న తేజ్‌బాలీ సింగ్ పటేల్‌కు ఈ విషయం తెలిసింది. విద్యుత్ సమస్యలపై గ్రామస్తులు తనను కాకుండా దళిత వ్యక్తి రాజేంద్రను సంప్రదించడంపై అతడు ఆగ్రహం చెందాడు. దీంతో రాజేంద్ర ఉంటున్న ఇంటికి వెళ్లి అతడ్ని కొట్టాడు. అంతేగాక తన చెప్పును నాకించాడు. గ్రామంలో విద్యుత్ పనులు చేయవద్దని హెచ్చరించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. దళిత వ్యక్తిని కొట్టడంతోపాటు చెప్పును నాకించిన ఎలక్ట్రికల్ లైన్మెన్ తేజ్‌బాలీ సింగ్ పటేల్‌ను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
A disturbing incident took place in Uttar Pradesh's Sonbhadra district, where a Dalit man was allegedly assaulted and humiliated by a contractual power worker. The incident occurred when the accused became angry after the Dalit man checked faulty electrical wiring. Videos of the… pic.twitter.com/OY7gdfVEom
— Dalit Activist (@APDalitActivist) July 9, 2023