Raja Saab | పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ విడుదలకు సిద్ధమైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్‌లో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం (డిసెంబర్ 27) హైదరాబాద్‌లో ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. హీరో ప్రభాస్‌తో పాటు చిత్రబృందం మొత్తం ఈ వేడుకకు హాజరుకాగా, భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్‌తో కలిసి పని చేసిన అనుభవాలను పంచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈవెంట్లో మాట్లాడిన హీరోయిన్ రిద్ది కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
“ప్రభాస్ గారి కోసం సినిమా చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మూడు సంవత్సరాల క్రితం ఆయన నాకు కానుకగా ఇచ్చిన చీరనే ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ధరించి వచ్చాను” అని రిద్ధి చెప్పగానే ప్రాంగణం మొత్తం హోరెత్తింది. అభిమానులు గట్టిగా “ప్రభాస్.. ప్రభాస్” అంటూ నినాదాలు చేయడంతో ఆ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక మరో హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ, ప్రభాస్‌తో సినిమా చేయటం తన అదృష్టమని తెలిపారు.
ప్రభాస్‌తో ఉంటే ప్రతి రోజూ పండగే” అంటూ డార్లింగ్‌పై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు నిధి . మూడో హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పటినుంచో కోరిక. అలాంటి సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అని చెప్పారు. మొత్తంగా ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రభాస్ క్రేజ్, హీరోయిన్ల ఎమోషనల్ కామెంట్స్‌తో అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.