మథుర, సెప్టెంబర్ 20: కదులుతున్న కారులో ముగ్గురు వ్యక్తులు ఒక దళిత బాలిక(13)పై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఎస్పీ(గ్రామీణ) త్రిగుణ్ బైసెన్ కథనం ప్రకారం అల్పాహారానికి కావాల్సిన సరకులు కొనడానికి గురువారం బాలిక ఇంటి పక్కన ఉన్న దుకాణానికి వెళ్లింది.
అక్కడ నీరజ్ అనే వ్యక్తి ఆమెకు మత్తు మందు కలిపిన నీళ్లు తాగడానికి ఇచ్చాడు. ఆ తర్వాత బాలిక మైకంతో పడిపోగానే ఆమెను నీరజ్, అతడి సహచరుడు కారులో తీసుకెళ్లి లైంగిక దాడి చేసి ఆమెను బర్సానా రోడ్లోని ఫ్లైఓవర్ కింద పడేశారు.