జైపూర్, సెప్టెంబర్ 14: రాజస్థాన్లో కొంతమంది 12 ఏండ్ల ఓ దళిత బాలుడిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. దొంగతనం చేశాడన్న నెపం మోపుతూ..ఆ బాలుడి బట్టలు ఊడదీసి, నగ్నంగా నడిరోడ్డుపై నృత్యం చేయించారు. శుక్రవారం రాత్రి కోటా నగరంలో చోటుచేసుకున్న అమానవీయ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
జీఏడీ సర్కిల్ వద్ద జరిగిన ఓ హాస్య కార్యక్రమానికి తన కుమారుడు హాజరయ్యాడని, మ్యూజిక్ వైర్లు దొంగలించాడన్న నెపంతో రాత్రి 1 గంట సమయంలో తన కుమారుడిపై కొంతమంది దాడి చేశారని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.