ధర్మశాల: బౌద్ద మత గురువు దలైలామా(Dalai Lama) మరో 40 ఏళ్ల పాటు జీవించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు 90 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఆర్గనైజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 130 ఏళ్లు వచ్చే వరకు అంటే మరో 40 ఏళ్ల పాటు జీవించే అవకాశాలు ఉన్నట్లు దలైలామా తెలిపారు. సుదీర్ఘమైన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ అనేక మంది బౌద్ద భక్తులు ఆయన్ను సందర్శిస్తున్నారు. ఆదివారం రోజున దలైలామా 90వ బర్త్డే వేడుకలు జరగనున్నాయి. తాను 110 ఏళ్లు జీవించే అవకాశాలు ఉన్నట్లు గత డిసెంబర్లో దలైలామా ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు తెలిపారు.