Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Mini Cooper | మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ముగ్గురి మృతికి కారణమైన యువకుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా తలపొగరు వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రమాదానికి సంబంధించి ఏం జరిగినా తనపైకి రాకుండా చూసుకోవడానికి మా డాడీ ఉన్నాడులే అని ఆ యువకుడు వ్యాఖ్యానించాడు. కేరళ (Kerala) లోని నెడుంబస్సెరి (Nedumbasseri) లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mini Cooper : మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ముగ్గురి మృతికి కారణమైన యువకుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా తలపొగరు వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రమాదానికి సంబంధించి ఏం జరిగినా తనపైకి రాకుండా చూసుకోవడానికి మా డాడీ ఉన్నాడులే అని ఆ యువకుడు వ్యాఖ్యానించాడు. కేరళ (Kerala) లోని నెడుంబస్సెరి (Nedumbasseri) లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అలప్పుళ సౌత్‌కు చెందిన 19 ఏళ్ల సజీవ్ తన స్నేహితుడితో కలిసి నెడుంబస్సేరి సమీపంలోని ఎయిర్‌పోర్టు రోడ్డుపై మినీకూపర్లో వేగంగా వెళ్తూ ఓ స్కూటర్‌ను ఢీకొట్టాడు. దాంతో బండిపై ఉన్న ఇద్దరు యువతులు, ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అరెస్ట్ చేశారు.
అయితే అంతకుముందు ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది స్థానికులు నిందితులను పట్టుకుని ప్రశ్నించారు. అప్పుడు నిందితుడు సజీవ్ మాట్లాడుతూ.. ఏం జరిగినా చూసుకోవడానికి మా డాడీ ఉన్నాడంటూ తలపొగరుగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. దాంతో కోపోద్రిక్తులైన స్థానికులు వారిపై దాడికి యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఘటన సమయంలో నిందితులు మద్యం మత్తుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనకు ముందు సజీవ్ ఇన్స్టాగ్రామ్ పేజీలో కారు హైవేపై గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న దృశ్యాలు కనిపించడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

