న్యూఢిల్లీ: నకిలీ కాల్సెంటర్ తెరిచి అమెజాన్ కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 26 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా అమెరికాలోని అమెజాన్ వినియోగదారులకు ‘మీ ఐడీ హ్యాక్ అయింది. తిరిగి పొందాలంటే డబ్బు కట్టాలి’ అంటూ కాల్ చేసి, దాదాపు రూ.4 కోట్లు కొల్లగొట్టినట్టు వెల్లడించారు.