Anna Konidala | పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల స్పెషల్ బర్త్‌డే విషెస్.. టచ్ చేశావు అంటున్న ఫ్యాన్స్
Anna Konidala | పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్‌కు విషెస్ వెల్లువెత్తుతున్న వేళ.. ఆయన భార్య అన్నా కొణిదెల చేసిన ప్రత్యేక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Anna Konidala | పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్‌కు విషెస్ వెల్లువెత్తుతున్న వేళ.. ఆయన భార్య అన్నా కొణిదెల చేసిన ప్రత్యేక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని అన్నా కొణిదెల తన భర్తతో కలిసి ఉన్న ఓ అందమైన, వ్యక్తిగత ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోతో పాటు పవన్‌పై తనకున్న ఆప్యాయతను, ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానం, గౌరవాన్ని ప్రతిబింబించేలా హృదయపూర్వక సందేశాన్ని రాశారు.
అన్నా కొణిదెల తన పోస్టులో.. “ఈ రోజు మీ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు ఎంతో మంది హృదయాల్లో, ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నారు. మీరు ఎంతమంది జీవితాలను ప్రభావితం చేశారో, ఇతరులకు ఎంతగా ఇచ్చారో చెప్పడానికి ఇదొక అందమైన ప్రతిబింబం. పుట్టినరోజు శుభాకాంక్షలు!” అంటూ భావోద్వేగపూర్వకంగా విషెస్ తెలిపారు.చిన్నదైన ఈ సందేశంలోనే పవన్ కళ్యాణ్‌పై ఉన్న కుటుంబ అనుబంధంతో పాటు.. ఆయన వ్యక్తిత్వం, సేవా భావం, ప్రజల్లో సంపాదించుకున్న గౌరవాన్ని అన్నా కొణిదెల ప్రస్తావించడం విశేషంగా నిలిచింది.
అన్నా కొణిదెల షేర్ చేసిన ఫొటోలో దంపతులు ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా కనిపిస్తున్నారు. సాధారణంగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన రాజకీయ, సినీ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే కుటుంబ సభ్యులు పంచుకునే ఇలాంటి వ్యక్తిగత క్షణాల ఫొటోలకు అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అందుకే అన్నా కొణిదెల షేర్ చేసిన ఈ ఫొటో, ఆమె రాసిన బర్త్‌డే నోట్ ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు కూడా కామెంట్ల రూపంలో తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు కేవలం కుటుంబ సభ్యుల నుంచే కాకుండా.. సినిమాలు, రాజకీయాలు, సామాజిక సేవ వంటి విభిన్న రంగాల్లో ఆయనతో అనుబంధం ఉన్న ఎంతోమంది నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

