OG 2 | నేడు ఫ్యాన్స్‌కు నిరాశేనా .. ‘OG 2’ నుంచి ఆ అప్డేట్ కోసం ఎదురుచూపులు!
OG 2 | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ బర్త్‌డే అంటేనే అభిమానులకు పండగ వాతావరణం. ఇక ఈసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా వరుసగా క్రేజీ అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
OG 2 | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ బర్త్‌డే అంటేనే అభిమానులకు పండగ వాతావరణం. ఇక ఈసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా వరుసగా క్రేజీ అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల నుంచి కీలక ప్రకటనలు ఉంటాయని భావించారు. అందులోనూ ‘OG 2’పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. అర్ధరాత్రి నుంచే ఏదైనా సర్ప్రైజ్ అప్డేట్ వస్తుందని పవన్ అభిమానులు ఆశించారు. అయితే ఇప్పటివరకు అలాంటి భారీ ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.
‘OG’ సినిమాపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్‌ను సుజీత్ తనదైన స్టైలిష్ యాక్షన్ ట్రీట్మెంట్తో చూపించబోతున్నారనే ప్రచారం మొదటి నుంచే సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చింది.మరోవైపు సంగీత దర్శకుడు థమన్ గతంలో ఇచ్చిన కొన్ని హింట్స్ కూడా అభిమానుల అంచనాలను మరింత పెంచాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏదో పెద్ద ప్రకటన ఉండబోతోందనే చర్చ సోషల్ మీడియాలో జరిగింది. దీంతో ఫ్యాన్స్ అర్ధరాత్రి నుంచే సోషల్ మీడియా వేదికగా అప్డేట్స్ కోసం ఎదురుచూశారు.
కానీ ఇప్పటివరకు మాత్రం భారీ అప్డేట్కు బదులుగా బర్త్‌డే పోస్టర్‌తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది. దీంతో ‘OG 2’కు సంబంధించిన ప్రకటన కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో నిరాశ కనిపిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘OG’ సినిమాపై పవన్ అభిమానుల్లో మొదటి నుంచే విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్‌ను పూర్తిస్థాయి యాక్షన్ అవతార్‌లో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘OG 2’ గురించి ఏదైనా అధికారిక ప్రకటన వస్తే అది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే పవన్ బర్త్‌డేను మేకర్స్ కూడా ప్రత్యేకంగా ఉపయోగించుకుంటారని అభిమానులు భావించారు.అయితే ఈ రోజు సాయంత్రం 4.05ని.లకి ఓజీ2 నుండి చిన్న ట్రీట్ ఉంటుందని సుజీత్ తెలియజేశారు. దీంతో ఫ్యాన్స్ ఆ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- collections
- imran hashmi
- OG
- OG 2
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

